నూతన ఎస్సైని కలిసిన జనసేన నాయకులు..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ లో ఇటీవల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పోచంపల్లి సతీష్ ని శనివారం జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన జయశంకర్ భూపాలపల్లి పీఓసీ జెర్రిపోతుల సనత్‌కుమార్, జిల్లా నాయకులు కంకణాల దేవేందర్, చిట్యాల మండల జనసేన కో-ఆర్డినేటర్ అన్నారపు రమణ కుమార్ , నాయకులు చర్లపల్లి వెంకటేష్, మామిడాల దేవేందర్, జూకల్ అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply