కొమరగుంటలో కోలాహలంగా జల్లికట్టు

కొమరగుంటలో కోలాహలంగా జల్లికట్టు

  • ఎద్దుల జోరుకు – బేజారుపడ్డ యువకులు
  • జన సముద్రంగా మారిన గ్రామం
  • ప్రశాంతంగా ముగిసిన పశువుల పండగ

వెదురుకుప్పం,ఆంధ్ర ప్రభ : మండలంలోని కొమర గుంట పంచాయతీ చిన్న కొమర గుంట లో ఉన్న శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సంబరాలలో భాగంగా చివరి రోజు అయిన ఆదివారం పశువుల పండుగ పెద్ద కొమర గుంట గ్రామంలో పశువుల పండుగ నిర్వహించడం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామస్తులు ఐక్యమత్యంతో పశువుల పండుగను (పశువుల పండుగ) ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు వారం రోజులపాటు గ్రామంలో పశువులు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో గ్రామస్తులు నిమగ్నమయ్యారు.

ఉదయం చుట్టుపక్క గ్రామాల నుంచి సుధీర ప్రాంతాల నుంచి ఎద్దుల యజమానులు ఎద్దులను పట్టుకొని గ్రామంలోకి చేరారు. వందల సంఖ్యలో పశువులు రావడంతో గ్రామంలో ఎక్కడ చూసిన ఉత్సాహం మరింత రెడ్డింపైంది. గ్రామానికి సుమారు మూడు నాలుగు మండలాల నుంచి ప్రజలు వేల సంఖ్యలో పశువుల పండుగ తిలకించడానికి హాజరవడం జరిగింది.

గ్రామస్తులు గ్రామ నడివీధిలో అల్లిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. పశువులను పట్టేందుకు పోటీపడుతున్న యువకులకు పలు రకాల సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ క్రమంలో మధ్యాహ్నం రెండు గంటలకు పశువుల పండగ ప్రారంభమయింది.

ఈ పండుగలు ఎద్దులు దుమ్ము రేపుతూ యువకుల మధ్యలో వెళుతుంటే యువకులు కాలు దువ్వి ఎలాగైనా పశువులను పట్టేందుకు ప్రయత్నించారు. ఎద్దుల యజమానులు పశువుల కట్టిన చెక్క పలకలను సొంతం చేసుకొనడానికి యువకులు తలమునకులయ్యారు. కొన్ని ఎద్దులు యువకులకు చిక్కడంతో చెక్క పలకలు సొంతం చేసుకున్న యువకులు సంతోషం అంతా ఇంతా కాదు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ పశువుల పండుగలు గ్రామమంతా సందడి నెలకొంది.

ఎక్కడ చూసినా జన సందోసంతో గ్రామం నిండిపోయింది. మిధుల పైన, చెట్లు పైన, ప్రహరీ గోడల పైన, పొలాల వెంట ఎక్కడ చూసినా ప్రజలతో కొమర గుంట జన సముద్రంగా మారింది. ఈ పండుగలో ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులు గట్టి ఏర్పాట్లు చేశారు. సుధీర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు గ్రామస్తులు అన్నదానం నిర్వహించారు.

Leave a Reply