పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం

పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం

  • కేకేసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ : జీ రామ్ జీ చట్టంతో పేదల కడుపు కొట్టేందుకు, పంచాయతీల అధికారాన్ని లాక్కునేందుకు కేంద్రం కుట్రపన్నిందని కేకేసి రాష్ట్ర సహాయ కార్యదర్శి టి రాజశేఖర్ రెడ్డి అన్నారు.కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని విబిజి రామ్ జి పథకంగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని పత్తేపురం, పోలేపల్లి, నాంచారి మడూరు గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాల్లో నిరసనలు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ఏవిధంగా నిర్వీర్యం చేస్తుందో కూలీలకు వివరించారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు.కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ తో కలిసి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు.కేంద్రం ఏకపక్షంగా ఉపాధి హామీ పథకం పేరును మార్చిందని,ఇది ఫెడరల్ వ్యవస్థపై దాడేనని పేర్కొన్నారు.పథకం పేరును మార్చే ముందు రాష్ట్రాలతో కేంద్రం అసలు సంప్రదింపులు జరపనే లేదన్నారు. నరేగా బచావో సంగ్రామ్ ను దేశంలోని ప్రతి పల్లెకూ తీసుకెళ్తామన్నారు. ఉపాధి హక్కు,పంచాయతీ రాజ్ వ్యవస్థలు, మహిళలు, కార్మికులు, ఆదివాసీల హక్కులను కాపాడడమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని పేర్కొన్నారు.

జీ రామ్ జీ చట్టంలో ఉపాధి హామీపై గ్యారంటీనే లేదని, ఆ చట్టం చాలా ప్రమాదకరమైనదని విమర్శించారు. పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు,విలువల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. మొదటి నుంచే ఈ పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతోందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఇట్టె మాధవరెడ్డి, పయ్యావుల కళావతి, బంగారు రమేష్ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి ఉష , మండల యూత్ అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్, గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ లు ఉపేంద్ర, సతీష్, మురళి నాయకులు ఇమ్మడి శీను, దికొండ మధు, నరేందర్ రెడ్డి, అశోక్, యాకయ్య, వెంకన్న, వెంకట్ రెడ్డి,మున్నా, జానీ, జిలాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply