Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha SPL Story

Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha SPL Story
- మిలీషియా టార్గెట్
- సీసీటీవీ ఫుటేజీతో షాకింగ్ నిజాలు
- కతైబ్ హిజ్బుల్లా చుట్టూ కిడ్నాప్ కథ
- కిడ్నాపర్ల కోసం భద్రత దళాలు జల్డెడ
- ఎఫ్‌బీఐ, సీఐఏ ఇన్వెస్టిగేషన్ షురూ
- ఆందోళనలో అమెరికా కాన్సులేట్
- 48 గంటల్లో మిలిషియా దాడులు
- అమెరికన్లు అప్రమత్తం
( ఆంధ్రప్రభ, బాగ్దాద్ ప్రతినిధి )
అమెరికన్ ;ప్రీలాన్స్ లేడీ జర్నలిస్టు కిడ్నాప్ ఉదంతంతో అమెరికా అధికారులు ఠారెత్తిపోయారు. . కిడ్నాపర్లు తీసుకువెళ్లిన ఆ మహిళ జర్నలిస్టు జాడను గుర్తించంలో ఇరాక్ పోలీసుల వైఫల్యం తట్టుకోలేక అమెరికా రాయభార కార్యాలయం బేజారెత్తింది. పైగా.. ఇరానీ మద్దతుదారులే ఈ కిడ్నాప్‌నకు సూత్రధారులని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్న తరుణంలో.. మరో 48 గంటల్లో బాగ్దాద్ నగరంలో అమెరికా, ఇరాకీ పౌరులపై మిలీషియా గ్రూపులు దండెత్తే అవకాశం ఉందని నిఘావర్గాలు అలెర్ట్ చేయటంతో . బాగ్దాద్ లోని అమెరికా రాయభార కార్యాలయం కంగారెత్తింది.
Is Cia Agent : వెంటనే వెళ్లిపోండి

బాగ్దాద్ నగరం లో అప్రమత్తంగా ఉండటమే కాదు.. తక్షణమే స్వదేశానికి వెళ్లిపోవాలని తమ పౌరులను అమెరికా కాన్సులెట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 2, 2026 గురువారం ఎమ్మెర్జెన్సీ సేఫ్టీ వార్నింగ్ రిలీజ్ చేసింది.. రాబోయే 24 నుండి 48 గంటలలోపు బాగ్దాద్ నగర కేంద్రంపై ఇరాన్ అనకూల మిలీషియా బృందాలు దాడులు చేసే అవకాశం ఉందని ఈ హెచ్చరికలో పేర్కొంది.
Is Cia Agent : మిలీషియా టార్గెట్స్…

అమెరికన్లు , వ్యాపార సంస్థలు, విశ్వవిద్యాలయాలు, దౌత్య కార్యాలయాలు, ఇంధన మౌలిక సదుపాయాలు , హోటళ్లు , విమానాశ్రయాలు లక్ష్యంగా ఉండవచ్చని రాయబార కార్యాలయం తెలిపింది.

వీటితో పాటు ఇరాకీ ప్రభుత్వ సంస్థలు జనవాసాలు కూడా ప్రమాదంలో ఉండవచ్చు. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులు గతంలో కూడా అమెరికా సంస్థలపై క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో దాడులు చేశాయి. అంతేకాకుండా, విదేశీయులు ఎక్కువగా ఉండే హోటళ్లు, ఇతర ప్రాంతాలలో కిడ్నాప్‌లు జరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఇటువంటి దాడులను అరికట్టడంలో లేదా ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో ఇరాకీ అధికారులు విఫలమయ్యారని, కొంతమంది మిలీషియా సభ్యులు ప్రభుత్వ గుర్తింపు కార్డులతో దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని అమెరికా కాన్సలేట్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. .
Is Cia Agent : వార్నింగ్ బెల్

తక్షణమే ఇరాక్ వదిలి వెళ్లాలని అమెరికన్లను అలెర్ట్ చేశారు. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీకి లేదా ఎర్బిల్‌లోని కాన్సులేట్‌కు వెళ్లడానికి ప్రయత్నించవద్దని కోరారు, ఎందుకంటే సాధారణ కాన్సులర్ సేవలు తాత్కాలికంగా నిలిపి వేశారు. అమెరికా పౌరులు తమ వ్యక్తిగత గుర్తింపును బహిర్గత పర్చవద్దని, జనసమూహాలకు దూరంగా ఉండాలని , ఎప్పటికప్పుడు వార్తలను గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఇరాక్ “లెవల్ 4 ప్రయాణించవద్దు” విభాగంలో ఉంది. బాగ్దాద్ పరిసర ప్రాంతాలలో భద్రతా పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Is Cia Agent : సీసీ పుటేజీ కలకలం

సీసీటీవీ (CCTV) ఫుటేజీ ఆధారంగా ఆమెను కిడ్నాపర్లు ఏరీతిలో తీసుకు వెళ్లారో వివిధ వెలుగులోకి వచ్చింది, ఆమెను పట్టపగలు బాగ్దా ద్ వీధి నుండి బలవంతంగా వాహనంలోకి ఎక్కించడంఈ వీడియోలో కనిపిస్తోంది. బాగ్దాద్ సాదూన్ వీధిలో (Al-Saadoun Street) ఒక హోటల్ సమీపంలో షెల్లీ కిటెల్సన్ నిలబడి ఉండగా, ఒక సిల్వర్ కలర్ కారు (Silver Car) ఆమె పక్కన ఆగింది. కారు నుండి దిగిన ఇద్దరు వ్యక్తులు ఆమెను పట్టుకుని వెనుక సీటులోకి నెట్టారు. ఆ సమయంలో ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కిడ్నాపర్లు ఆమెను కారులోకి ఎక్కించుకున్న సెకన్ల వ్యవధిలోనే వేగంగా పోనిచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో సమీపంలోని ప్రజలు నిశ్చేష్టులయ్యారు.
Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటా?

కిడ్నాపర్ల చెరలోని షెల్లీ కిటెల్సన్ ప్రీలాన్స్ బురఖాలో సీఐఏ ఏజెంటుగా ఇరాక్ మిలీషియా బృందాలు అనుమానించాయి. ఆమె ఇన్వెస్టిగేషన్ స్టయిల్ పై అనేక అనుమానాలు తప్పలేదు. తాజా యుద్ధ సమయంలో ఆమెను కిడ్నాప్ చేస్తే మరింత సమాచారం లభిస్తుందని ఐఆర్జీసీ వ్యూహంతోనే ఈ కిడ్నాప్ జరిగినట్టు లోకల్ పత్రికల్లో ప్రత్యేక కథనాలు సంచలనం రేపాయి. జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్ ను కచ్చితంగా ఏ మిలీషియా గ్రూప్ కిడ్నాప్ చేసిందో ఇరాక్ భద్రత దళాలకు ఆరా లేదు. అమెరికా నిఘా వర్గాలు మాత్రం షెల్లీని కతైబ్ హిజ్బుల్లా మిలీషియా బృందం ఎత్తుకెళ్లివందని అధికారులను అలెర్ట్ చేశారు. వాస్తవానికి ఆమెను కిడ్నాప్ చేయాలని కతైబ్ SR

హిజ్బుల్లా కుట్ర పన్నినట్టు అమెరికా ప్రభుత్వం ఇటీవల కిటెల్సన్‌ను హెచ్చరించింమె అప్పటికే ఇరాక్‌లో రిపోర్టింగ్ చేస్తున్నారు. కిటెల్సన్‌కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రాక్సీ నుంచి బెదిరింపులను అమెరికా, ఇరాక్ అధికారులు గుర్తించారు. . ఆమెను కిడ్నాప్ చేసి చంపేస్తారని కొన్ని వారాల కిందటే ఇరాక్ వదిలి వెళ్లానని ఆమెను హెచ్చరించారు. షెల్లీ కిటెల్స్ ప్రీలాన్స్ జర్నలిస్ట్. మధ్యప్రాచ్యం, ఆఫ్ఘనిస్తాన్‌లో టాలెంటెడ్ జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఆమె రచనలు అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ ఇటాలియన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
Is Cia Agent : ఇంతకీ కిడ్నపర్లు ఎవరు?

బాగ్దాద్ నడిరోడ్డులో.. జనం చూప్తుండగానే ఫెల్లీని కిడ్నాప్ చేసిందెవరు? అమెరికా నిఘా వర్గాలు మాత్రం కతైబ్ హిజ్బుల్లా మిలీషియా ను అనుమానిస్టుండగా.. ఖచ్చితంగా నిర్దారణకు రాలేదు. ఎందుకంటే.. ఇప్పటి వరకూ కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్లు రాలేదు. ఇరాక్ లో 5 మిలీషియా బంధాలు ఇరాన్‌కు మద్దతుగా పని చేస్తున్నాయి. వీటిలో కతైబ్ హిజ్బుల్లా అత్యంత ప్రమాదకర మిలీషియా. అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్‌లో ఈ సంస్థ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.ఇక అసాయిబ్ అహ్ల్ అల్-హక్ గ్రూప్ లీడర్ ఖైస్ అల్-ఖజాలీ పదేపదే అమెరికా దళాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తుంటారు. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ ఇది వివిధ ఇరాన్ అనుకూల మిలీషియాల కూటమి. ఇటీవల ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రోన్ క్షిపణి దాడులకు దిగింది. బద్ర్ఆర్గ నై జేషన్ ఇరాక్‌లోని పురాతన అతిపెద్ద మిలీషియాలలో ఒకటి, ఇది ఇరాన్ కమాండర్ల నుంచి నేరుగా ఆదేశాలు పొందుతుంది. హరకత్ అల్-నుజాబా అమెరికా వ్యతిరేక దాడులలో ఇది అత్యంత చురుకుగా పాల్గొంటోంది. ఈ స్థితిలో ఈ నాలుగు మిలీషియా బృందాల్లో … ఎవరు షెల్లీని కిడ్నాప్ చేశారో.. మిస్టరీగా మారింది.
Is Cia Agent : కాన్సలేట్ ఆఫీసర్లలో కంగారు

నలుగురు వ్యక్తులు సివిల్ దుస్తుల్లో వచ్చి ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు ఇరాక్ భద్రతా దళాలు కిడ్నాపర్ల కారును వెంబడించగా, బాబిల్ ప్రావిన్స్‌లోని అల్-హస్వా సమీపంలో ఒక కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కతైబ్ హిజ్బుల్లా సంస్థకు చెందిన ఒకరిని ని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే కిడ్నాపర్లు జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను వేరొక కారులోకి మార్చి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఎఫ్‌బీఐ (FBI) ఆమెను సురక్షితంగా విడిపించేందుకు ఇరాకీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం బాగ్దాద్‌లో భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ కిడ్నాప్ నేపథ్యంలోనే అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలను జారీ చేసింది.
