Iran War Strategy: విర‌మ‌ణ కాదు.. స‌న్న‌ద్ధం Andhra Prabha Top Story

Iran War Strategy: విర‌మ‌ణ కాదు.. స‌న్న‌ద్ధం Andhra Prabha Top Story

  • చహల్లామ్​ సాక్షిగా,,,
  • ఇరాన్​ యుద్ధ రీతి
  • సీజ్​ ఫైర్​ తో.. సన్నద్ధం
  • ప్రతీకారమే టార్గెట్​
  • భారీ దాడులతో ఉద్రిక్తతలు
  • రష్యా ఆయుధాలపై ఫోకస్​
  • మళ్లీ యుద్ధానికి సంకేతాలు

( ఆంధ్రప్రభ , టెహ్రాన్​ ప్రతినిధి)

Iran War Strategy

ఎట్టకేలకు ఇరాన్​ పై అమెరికా ఇజ్రాయెల్​ ఎక్కుపెట్టిన ఆపరేఫన్​ ఎథిక్​ ప్యూరీకి తాత్కాలిక విరామం లభించింది. మరి కొన్ని గంటల్లో అంతం దిశలో బిక్కుబిక్కుమన్న ఓ నాగరికత ఊపిరి నిలిచింది. ఇది తాత్కాలికం కావొచ్చు.. కానీ 195 దేశాల్లో 830 కోట్ల మంద ఈ రోజున సంతోషంతో గంతులేశారు. అమెరికా, ఇరాన్​ దేశాలు విజయగర్వంతో మీశాలు మెలివేశాయి. ఈ అనధికార యుద్ధంలో ఎవరి గెలిచారు.. ఓడారో.. తేలలేదు. కేవలం తత్కాలిక కాల్పుల విరమణకే ఈ రెండు దేశాల ఆనందానికి అవధి లేదు. ఇక అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్​.. కాల్పుల విరమణకు నరాలు తెగే ఉత్కంఠతను ఎదుర్కొన్న పాకిస్థాన్ దేశాల స్థితి వర్ణనాతీతం. ఇక ప్రపంచంలో మేటి దేశాలు.. భారత్​ , జపాన్​, బ్రిటన్​, ప్రాన్స్​, ఇటలీ.. ఇలా అనేక దేశాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ను.. ఇరాన్​ నాయకులను కంగ్రాట్స్​ అభినందన మాలతో ముంచెత్తారు. సరే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.

Iran War Strategy : నయా పాచిక

Iran War Strategy

40 రోజుల పాటు సాగిన ఈ అనధికార యుద్ధం పశ్చిమ ఆసియాను అతలాకుతలం చేసింది. ప్రపంచాన్ని గజగజ వణికించింది. ఇరాన్​ కలుగుల్లోని అణ్వాయుధాలను వెలికి తీసి..ప్రపంచ శాంతి స్థాపన కోసం.. అమెరికా అధ్యక్షుడు కంటిమీద కునుకు తీయలేదు. కానీ అణ్వాయుధ సమస్య దారి మళ్లింది.. హోర్ముజ జలసంధి .. హాట్​ టాపిక్​ గా మారింది. హాట్​ టాపిక్​ కాదు.. ఈ యుద్ధంలో కీ రోల్​ పోషించింది. హోర్ముజ జలసంధిని తెరవక పోతే.. ఇరాన్​ నాగరికతకే ఎసరు పెడ్తానని అమెరికా అధ్యక్షుడు హుంకరించారు. తమ పైన్యం మొత్తాన్ని ఇరాన్​ వైపు తరిమారు. ఇక తోడుగా ఇజ్రాయెల్​ తన వంతు పాత్రలో .. జీవించింది. ఇనాన్​ మౌలిక సదుపాయాలు.. విమానాశ్రయాలు, విద్యుత్తు కేంద్రాలు, వంతెనలు.. రైలు మార్గాలను టార్గెట్​ చేసింది. కడకు జనవాసాలనూ వదల్లేదు. ఇక ఇరాన్​ కూడా ప్రతీకార దాడుల్లో ఎక్కడ తగ్గలేదు. 19 అమెరికా, ఇజ్రాయెల్​, మిత్ర దేశాల్లోని కీలక ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఈ అప్రకటిత వార్​.. భీకర యుద్ధంగా మారుతున్న గంట ముందు.. మధ్యవర్తి హిత బోధను అమెరికా, ఇరాన్​ గౌరవించాయి. రెండు వారాలపాటు కాల్పులు జరప కూడదని ఒట్టేసుకున్నాయి. ఓకే ఈ ఇక్కడే ​ జనం నోరు వెళ్ల కక్కే రీతిలో మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది.

Iran War Strategy : నెంబర్​ 40 సెంటిమెంట్​.,,

Iran War Strategy

ఫిబ్రవరి 28న టెహ్రాన్​ లోని తన అధికారిక భవనంలో అధికారులతో మాట్లాడుతున్న ఇరాన్​ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ​ సహా 40 మందిని అమెరికా ఖతం చేసింది. ఇంతటితో వెనుజులా కథలాగే .. ఇరాన్​ కథ అంతమైందని అమెరికా అధ్యక్షుడు ఆనంద పరవశుడయ్యారు. వెంటనే నెక్ట్స్​ టార్గెట్​ క్యూబా ను ప్రకటించారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇరాన్​ సుప్రీం లీడర్​ అయతుల్తా ఖమేనీ మరణంతో.. ఇరాన్​ ప్రజలు కంటతడి పెట్టారు. 40 రోజులు సంతాప దినాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆయతుల్లా సంస్మరణను కూడా 40వ రోజునే చహల్లామ్ నిర్వహించాలి. మరో విశేషమేంటంటే .. మంగళవారం ఇజ్రాయెల్​, ఇరాన్​ మధ్య దాడుల్లో మొత్తం 40 మంది మృత చెందారు.

ఖమేనీ చహల్లామ్ సాక్ష్యంగా ,,,

Iran War Strategy

ఈ రోజునే ఆయన ఘనతను జనం స్మరించుకుంటారు. ఎందుకంటే.. షియా ముస్లింలు ‘అర్బైన్’ పేరుతో ఇమామ్ హుస్సేన్ మరణించిన 40వ రోజున పెద్ద ఎత్తున సంస్మరణ దినాన్ని నిర్వహిస్తారు.ఖైమేనీకి నివాళి అర్పించే క్రమంలో అమెరికా అంతు చూస్తాం అని ప్రతిజ్ఞ చేయటానికి సర్వసన్నద్ధం అవుతున్నారు. ఇలాంటి స్థితిలో అమెరికా దాడి చేస్తే.. ఈ కార్యక్రమం సాగదు. ఇక ఇరాన్ సంస్కృతిలో ‘చహల్లామ్’ లేదా ‘అర్బైన్’ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇమామ్ హుస్సేన్ వీరమణం 40వ రోజున చహల్లామ్ లో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది షియా ముస్లింలు ఇరాన్ మీదుగా ఇరాక్‌లోని కర్బలాకు కాలినడకన యాత్ర చేస్తారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో, ఈ ఏడాది ఈ యాత్రలు సామూహిక ప్రార్థనలపై ఇరాన్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఆయతుల్లా ఖమేనీ సంస్మరణ కార్యక్రమం చేపట్టింది, ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా.. తాజాగా.. ట్రంప్​ వార్నింగ్​ కు గంట ముందు కాల్పుల విరమణకు ఇరాన్​ తలవంచింది. ఇదీ అసలు కథ.

Iran War Strategy : ఆ గంట ముందే..

Iran War Strategy

కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి కేవలం కొన్ని గంటల ముందే కమాండ్ కేంద్రాలు సహా 19 అమెరికా-ఇజ్రాయెల్, మిత్రదేశాల ఇంధన, సైనిక, నిఘా స్థావరాలపై ఇరాన్ ఐఆర్జీసీ భారీ స్థాయిలో క్షిపణి డ్రోన్ దాడులు చేసింది. ఖతార్‌లోని అల్ ఉదీద్ (Al Udeid) ఎయిర్ బేస్ (అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం) ఇరాక్‌లోని ఐన్ అల్-అసద్ (Ain al-Asad) బేస్. ఇంధన, మౌలిక వసతులు: కువైట్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని చమురు శుద్ధి కర్మాగారాలు, విద్యుత్తు కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్ల పై ఇరాన్​ విరుచు పడింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్, జోర్డాన్‌లోని మువాఫక్ అల్ సల్తీ ఎయిర్ బేస్ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇరాన్ తన “99వ తరంగం” దాడుల్లో వందలాది డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులతో కువైట్‌లోని చమురు కేంద్రాలకు గణనీయ నష్టం వాటిల్లింది. తన సొంత ఇంధన మౌలిక సదుపాయాలపై (లావన్ ఐలాండ్ వంటివి) అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల తర్వాత ఒప్పందం కుదిరినప్పటికీ, ఇరాన్ తన “వేలు ట్రిగ్గర్ పైనే ఉందని” అమెరికాను హెచ్చరించింది. తాత్కాలికంగా దాడులు ఆపినప్పటికీ, విదేశీ దళాలు తమపై మళ్లీ దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేసింది.

Iran War Strategy : విరామం కాదు..సన్నద్ధం

Iran War Strategy

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ విధించిన డెడ్​ లైన్​ గడువుకు ముందే ఇజ్రాయెల్​ , అమెరికా దళాలు దూకుడు పెంచాయి. ఇరాన్​ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ఈ స్థితిలో ఎన్ని ప్రతీకార దాడులు చేసినా.. ఇజ్రాయెల్​ విమానాలకు కళ్లెం వేయలేని స్థితి కళ్లకు కనిపించింది. వంతెనలు కూలిపోయాయి. విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అన్నిటి కంటే… తమ సుప్రీం లీడర్​ ఆయతుల్లా ఖమేనీ మరణించి 40వ రోజుకు చేరింది. ఆయనకు దేశ ప్రజలు కన్నీటి సంస్మరణ జరపాలి. ఈ కీలకాంశాలతో పాటు.. భూగర్భంలోని ఆయుధాలను బయటకు తీయాలి. విమాన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. అమెరికా విమానాలను కూల్చాలంటే.. రష్యా ఆయుధాలు అవసరం. వీటన్నిటినీ సేకరించటానికి సమయం కావాలి. ఈ లోపు చర్చలతో కాలాయాపన చేసి.. ప్రజల్లో దేశ భక్తిని రగిల్చి మళ్లీ సిద్ధం కావాలన్నది ఇరాన్​ వ్యూహం. ప్రస్తుతం కాల్నులు ఆపేశాం. కానీ ట్రిగ్గర్​ పైనే వేలు ఉంది. విదేశీ దాడుల్ని తిప్పి కొడతాం, అని ఐఆర్జీసీ అమెరికాను హెచ్చరించింది. ఏతావాతా.. ఈ విరామం రెండు దేశాలూ ఆయుధాల సేకరణకే.. కాల్పుల విరమణకు తలవంచినట్టు విశ్లేషకుల అంచనా.

ALSO READ : Iran Us Ceasefire : జ‌ల‌తంత్రం Andhra Prabha Top Story

Leave a Reply