Iran Hurrey : ట్రంప్ స‌డెన్ బ్రేక్ Andhra Prabha Latest News

Iran Hurrey : ట్రంప్ స‌డెన్ బ్రేక్ Andhra Prabha Latest News

  • యుద్ధానికి స్వ‌స్తి
  • ఆయిల్ పై ఆంక్షల సడలింపు
  • ఇరాన్ విజయోత్సాహం
  • హార్ముజ్ జలసంధిపై అమెరికా షాకింగ్ స్టాండ్
  • నాటో దేశాలపై ట్రంప్ ఆక్రోశం
  • చమురు మార్కెట్ లో చిందులు
  • ఆయిల్ ధ‌ర స్పీడ్ కు బ్రేక్‌

( ఆంధ్ర‌ప్ర‌భ‌, న్యూయార్క్ ప్ర‌తినిధి)

Iran Hurrey

ప‌శ్చిమ ఆసియాను అగ్నిగుండంగా మార్చిన ఇరాన్ పై ఆప‌రేష‌న్ ఎథిక్ ఫ్యూరీకి అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అక‌స్మాత్తుగా.. అనూహ్యం స‌డ‌న్ బ్రేక్ వేశారు. ఒక ర‌కంగా యుద్ధానికి తాత్కాలిక తెర‌దించిన‌ట్టే. అశ్వ‌త్తామ హ‌త‌\ కుంజ‌ర‌\ అనే రీతిలో ఇరాన్ ఆయిల్ పై ఆంక్ష‌ల‌ను ఎత్తి వేశారు,. హోర్ముజ జ‌ల‌సందితో త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ రెండు అంశాల‌తో,.. ఇజ్రో అమెరికా ఆప‌రేష‌న్ ఎథిక్ ఫ్యూరీకి స్వ‌స్తి ప‌లికిన‌ట్టేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇరాన్ ఆయిల్ స‌ర‌ఫ‌రాపై ఆంక్ష‌ల‌ను టెంప‌ర‌కీగా ర‌ద్దు చేసింది. ఇరాన్ ఆయిల్ పై ఆంక్ష‌ల‌ను 30 రోజులు తొల‌గిస్తున్న‌ట్టు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు.

Iran Hurrey

ఈ సంచ‌లనాత్మ‌క నిర్ణ‌యంతో ఇరాన్ హుర్రే అని నిన‌దిస్తే.. యావ‌త్ ప్ర‌పంచం మాట్రం ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇరాన్ ఆయిల్ విక్ర‌యించ‌వ‌చ్చు.. కానీ ఆదాయం మాత్రం ఇరాన్ ఖాతాకు చేర‌దు అంటూ ఈ వ‌రంతో పండంటి బిడ్డ‌ను క‌న‌వ‌చ్చు అదియునూ నీ పతి ప్రాణంబు ద‌క్క అని త‌న వెంట ప‌డిన స‌తీసావిత్రికి య‌ముడు వ‌రం ఇచ్చిన రీతిలో ఇరాన్ ఆయిల్ పై అమెరికా అధ్య‌క్షుడు ఆంక్ష‌లు స‌డ‌లించిన‌ట్టుంద‌ని సోష‌ల్ మీడియా వెక్కిరిస్తోంది. ఇది స‌రే.. అక‌స్మాత్తుగా .. అనూహ్యంగా అమెరికా అధ్య‌క్షుడు చేపిన ప్ర‌క‌ట‌న ఒక సారి ప‌రిశీలిద్దాం.

Iran Hurrey

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోరిడాకు వెళ్లే ముందు వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మధ్యప్రాచ్యంలో సైనిక చర్యల బ్రేకేజీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా తన లక్ష్యాలకు అతి చేరువ‌లో ఉందని, భారీ సైనిక బ‌లం అవ‌స‌రం లేద‌ని, అందుకే సైనిక కార్యకలాపాలను తగ్గించాల‌ని ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఆయన తన పోస్ట్‌లో ఐదు ప్రధాన లక్ష్యాలను ప్రస్తావించారు . ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, లాంచర్లను పూర్తిగా నిర్వీర్యం చేశాం. ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని (Defense Industrial Base) నాశనం చేశాం. నౌకాదళం, వైమానిక దళాన్ని, విమాన నిరోధక ఆయుధాలను తొలగించాం. . ఇరాన్ ఎప్పటికీ అణు సామర్థ్యాన్ని పొందకుండా , ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్‌, కువైట్ త‌దిత‌ర మిత్ర‌ దేశాలకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడం ల‌క్ష్యంగా ముందుకు సాగామ‌ని ట్రంప్ త‌న పోస్టులో వివ‌రించారు. .

Iran Hurrey : హార్ముజ్ బాధ్యత మాది కాదు

“హార్ముజ్ జలసంధిని దాని గుండా ప్రయాణించే దేశాలే కాపాడుకోవాలి. ఆ అవసరం అమెరికాకు లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాలు కోరితే అమెరికా సహాయం చేస్తుంది కానీ అది ఉచితంగా కాదు అని సంకేతాలిచ్చారు. యుద్ధాన్ని తగ్గించే ఆలోచన ఉన్నప్పటికీ, తక్షణమే కాల్పుల విరమణ ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. “అవతలి పక్షాన్ని పూర్తిగా తుడిచిపెడుతున్నప్పుడు (obliterating) సీజ్‌ఫైర్ గురించి ఆలోచించరు” అని ఆయన వ్యాఖ్యానించారు.

Iran Hurrey : వాళ్లు పిరికి పంద‌లు

ఈ యుద్ధంలో సహాయం చేయడానికి ముందుకు రాని నాటో (NATO) దేశాలను ఆయన “పిరికిపందలు” (Cowards) అని విమర్శించారు. ప్రస్తుతం ఇరాన్ భూభాగంలోకి అదనపు పదాతి దళాలను (ground troops) పంపే ఉద్దేశం లేదని ఆయన పునరుద్ఘాటించారు.

Iran Hurrey : ఇరాన్ హుర్రే

Iran Hurrey

అమెరికా త‌మ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తివేయటం ఇరాన్ సాధించిన “గొప్ప విజయంష‌గా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, అభివర్ణించారు. అమెరికా ఇజ్రాయెల్‌లు యుద్ధంలో వెనక్కి తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఒమన్ , ట‌ర్కీ లలో ఇటీవల జరిగిన దాడులతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా సైనిక ఉపసంహరణ గురించి మాట్లాడుతున్నప్పటికీ, ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను, రక్షణ దళాలను ఇంకా హై-అలెర్ట్‌లో ఉంచింది.

Iran Hurrey : చమురు మార్కెట్ చిందులు

Iran Hurrey

ఇరాన్ ఆయిల్ పై ఆంక్షల సడలింపుతో చ‌మురు మార్కెట్ చిందులు తొక్కుతోంది. ఇది తాత్కాలిక ఉపశమన‌మే, 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తుందన్న స‌మాచారంతో ఆయిల్ ధరలు మరింత పెరగకుండా అదుపులో ఉన్నాయి. అయినప్పటికీ, బ్రెంట్ క్రూడ్ $112.19 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. “హార్ముజ్ జలసంధి” బాధ్యత నుండి అమెరికా తప్పుకుంటే, అక్కడ రవాణాకు రక్షణ ఉండదని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది భవిష్యత్తులో ధరలు $120 దాటేలా చేసే అవకాశం ఉంది. గోల్డ్‌మన్ సాక్స్ హెచ్చరిక: యుద్ధం పూర్తిగా ముగిసే వరకు మార్కెట్‌లో అనిశ్చితి ఉంటుందని, 2027 వరకు వినియోగదారులపై భారం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Iran Hurrey : భారత్‌పై ప్రభావం

భారతదేశం తన చమురు అవసరాలలో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ధరలు ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం రష్యా నుండి తక్కువ ధరకే చమురు పొందే ప్రయత్నాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది.

ALSO READ : Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు​ Andhra Prabha Detail Report

Leave a Reply