బెంగళూరులో వర్షాలు కురుస్తున్న కారణంగా ఐపీఎల్ లీగ్, ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనితో, మే 23న బెంగళూరులో జరగాల్సిన ఆర్సీబీ – ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌ను లక్నోకు మార్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. అదేవిధంగా, ఆర్సీబీ మే 27న ఎకానా స్టేడియంలో లక్నోతో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
ప్లేఆఫ్స్ కు కొత్త వేదికలు.. .
పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో మే 29న క్వాలిఫయర్-1, మే 30న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. జూన్ 1న క్వాలిఫయర్-2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్‌లు గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి.