IPL betting apps | బలి పశువులుగా మారుతున్న యువత..

IPL betting apps | బలి పశువులుగా మారుతున్న యువత..

IPL betting apps | ఐపీఎల్ సందడి.. కానీ పెరుగుతున్న బెట్టింగ్ భయం
బెట్టింగ్ బారిన పడుతున్న యువత
హీరోలు, క్రికెటర్ల ప్రమోషన్లపై విమర్శలు
బెట్టింగ్ యాప్స్‌పై పోలీసుల హెచ్చరిక
బెట్టింగ్ ఊబిలో పడొద్దని సీపీ సజ్జనార్ సూచనలు

IPL betting apps | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : క్రికెట్ అభిమానులకి మెరుపుల పండగ ప్రారంభమయ్యింది. అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ మొదలైంది. అభిమాన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు కూడా సిద్ధమయ్యారు. అయితే ఆడేవారికి, ఆడించేవారికి కాసుల పంట, చూసేవాకన్నులపంట…కానీ కొందరు మాత్రం బలి పశువులంటా.!

చూసేవారందరూ అంతటితో ఆగరు కదా…అందులో కొందరు తమకు నచ్చిన ఆటగాడే గెలుస్తాడ్ని పట్టుబడతారు…తమకు నచ్చని జట్లవాళ్ళు ఓడిపోతారని భీష్మించుకుంటాడు…అలా పట్టుబట్టి ఊరుకోరుగా///పందెం కట్టి గెలుస్తారు-ఓడతారు…అదే బెట్టింగ్. ఈ బెట్టింగ్ బూతం మాయ ఇంతింత కాదయా అన్నట్టు ఒక్కసారి ట్రై చేద్దాం ఏం అవుతుంది అని మొదలు పెడితే చివరకు నిండు జీవితం బుగ్గిపాలు అయ్యేదాకా వదలదు. చిన్న వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, విదేశాల్లో పనిచేసే వారూ కూడా బెట్టింగ్ మాయాజాలం నుంచి తప్పించుకోలేక పోతున్నారు.

IPL betting apps

క్రికెట్ మ్యాచ్ మొదలైతే స్కోర్ కంటే రేట్ల గురించే ఎక్కువగా మాట్లాడేవాళ్లు పెరుగుతున్నారు. ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ అలవాటు, కొందరికి జీవితాలను తారుమారు చేసే స్థాయికి చేరింది. బెట్టింగ్ బారిన పడుతున్న వారిలో యువత ముందంజలో ఉంది. ఎంతో మంది యువత బెట్టింగ్ లో పడి ఉన్నదంతా పోగొట్టుకుని, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ.. అప్పుల బాధ భరించలేక కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కోకొల్లలు. బెట్టింగ్‌పై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపినా, చాప కింద నీరులా మళ్లీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి.

IPL betting apps

ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వాల్సిన హీరోలు, హీరోయిన్లు, దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాల్సిన కొందరు అభిమాన క్రికెటర్లు సైతం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ప్రకటనలతో బెట్టింగ్ పట్ట ఆకర్షితులై బలవుతున్నవారెందరో. బెట్టింగ్ నివారించడం ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ యాప్ లను అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా ప్రమోట్ చేసినవారిపై కేసులు కూడా నమోదు చేశారు. తెలంగాణలో కొంత మంది హీరోలు, హీరోయిన్లపై కూడా కేసులు ఉండడం గమనార్హం.

బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!

IPL betting apps

క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ సజ్జనార్ యువతకు సూచించారు. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ దందా కొత్త రూపం దాల్చింది.

కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ఉందన్నారు.

బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని, మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ తెలిపారు.

Leave a Reply