ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2025) సీజన్లో వరుస పరాజయాలతో సతమతమౌతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ జట్టు కెప్టెన్సీ పగ్గాలు మళ్ళీ ధోనీకి అప్పగించారు. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. దీంతో, ఈ సీజన్‌లోని మిగిలిన అన్ని మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా ఉంటాడని మేనేజ్మెంట్ తెలిపింది.
IPL 2025 | చెన్నై పగ్గాలు మళ్లీ ధోనీకే !
