విద్యార్థులు, సైబర్, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి…

విద్యార్థులు, సైబర్, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి…

  • కేజీబీవీలో బాలికలకు అవగాహన కల్పించిన ఎస్సై లు

చిట్యాల, ఆంధ్రప్రభ : సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ భద్రత, సోషల్ మీడియా పై అప్రమత్తంగా ఉండాలని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ ,రెండవ ఎస్ఐ హేమ లత, లు అన్నారు. శనివారం ​ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో విద్యార్థినులకు సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ భద్రతపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్.ఐ. పోచంపల్లి సతీష్ , ఎస్సై-2, హేమలత , పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

విద్యార్థులు సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి, విలువైన సమయాన్ని చదువుపై కేంద్రీకరించాలని కోరారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ప్రమాదకరమని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని హెచ్చరించారు. ​షీ టీమ్స్ డయల్ 100 ఎవరైనా వేధింపులకు గురిచేసినా , ఇబ్బంది పెట్టినా భయపడకుండా వెంటనే సమాచారం అందించాలని కోరారు .

బాల్యం నుంచే చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పోచంపల్లి సతీష్ , హేమలత లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుమలత, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.

Leave a Reply