Namination Centers | నామినేషన్ కేంద్రాల పరిశీలన

Namination Centers | నిజాంపేట, ఆంధ్రప్రభ : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ ప్రక్రియ కేంద్రాలను మెదక్ ఆర్డీఓ రమాదేశి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణం లో నామినేషన్ ప్రక్రియ కొనసాగేలా చూడాలని అధికారులకు సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామస్తులు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జి ఏంపీడీఓ వెంకట నరసింహారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, ఎన్నికల అధికారులు, వివిధ గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
