బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రహదారి పరిశీలన…

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రహదారిని పరిశీలించారు. పారిశుద్ధ్యకార్మికులకు పలు సూచనలు చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యలు బాగుంటాయని ఆమె అన్నారు అలాగే ప్రధాన రహదారి వెంట ఉన్న వ్యాపారస్తులకు చెత్తను రోడ్ల పైన వేయరాదని డస్ట్ బిన్లు ఉపయోగించుకోవాలని వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు.

అలాగే ఆమె పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు అందజేశారు. మాస్కులు ధరించకుండా పారిశుద్ధ్య పనులు చేస్తే ఆరోగ్యాలు దెబ్బతింటాయానీ పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా వాహనాల పార్కింగ్ ఏర్పాటు కొరకు హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్న చెట్టును తీసేసి పారిశుద్ధ్యం చేస్తున్నామని వారు తెలిపారు …వారి వెంట పలు వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply