INS Mahe| సైలెంట్ హంటర్… మాహె!

INS Mahe| సైలెంట్ హంటర్… మాహె!

  • నౌకాదళం అమ్ముల పొదిలో మరో బ్ర‌హ్మ‌స్త్రం..
  • ఈ రోజు నుంచే సేవ‌లు

Silent Mahe| వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భారత నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో(Anti-Submarine Warfare Vessel) వాటర్ క్రాఫ్ట్ ‘ఐఎన్ఎస్ మాహె ‘ ఈ రోజు నౌకాదళం సర్వీసులో చేరింది. ముంబయి నేవల్ డాక్యార్డులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీన్ని నేవీ (Indian Navy)కి అప్పగించారు.

INS Mahe | 80 శాతం స్వ‌దేశీ సాంకేతిక‌తో నిర్మాణం!


INS Mahe | కొచ్చిన్ షిప్పుయార్డులో 80 శాతం స్వ‌దేశీ సాంకేతిక‌త‌ను వినియోగించి ఈ ‘ఐఎన్ఎస్ మాహె (INS Mahe) లో నిర్మించారు. సైలంట్ హంటర్’ పిలిచే ఈ నౌక ప‌శ్చిమ వైపు ఉన్న సంద్రంలో కార్యకలాపాలు కొనసాగించనుంది. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం ‘మాహె’ పేరును ఈ నౌకకు పెట్టారు. దీని పైభాగంలో ‘ఉరుమి’ని ఏర్పాటు చేశారు. ఇది కలరిపయట్టులో ఉపయోగించే ఒక రకమైన ఆయుధం. పొడవైన, సన్నని కత్తి ఇది. చురుకుదనం, కచ్చితత్వం, యుద్ధ సమర్థతను ఇది సూచిస్తుంది. ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్టం కానుంది.

INS Mahe |

INS Mahe | జలాంతర్గాములను వేటాడేందుకు…


INS Mahe | జలాంతర్గాములను వేటాడేందుకు, తీర ప్రాంతంలో గస్తీని నిర్వహించేందుకు దీన్ని అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు. సముద్ర గర్భంలో నిఘాతోపాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ నౌక పాల్గొననుంది. ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్ క్రాఫ్ట్ (INS Mahe) నీటిలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. దీంతో శత్రు జలాంతర్గాములు దీని రాకను గుర్తించలేవు. అందుకే దీన్ని సైలెంట్ హంటర్ పిలుస్తున్నారు. ఇందులోని సోనార్ సిస్టమ్ దీనికి అదనపు ఆకర్షణ, శత్రు జలాంతర్గాములు, మైన్స్, సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు కళ్లూ, చెవులుగా పనిచేస్తుంది.

INS Mahe | ఇవీ ప్ర‌త్యేక‌త‌లు…

  • డీఆర్డీవో అభివృద్ధి చేసిన అభయ్ హల్-మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఏర్పాటుచేశారు. దీంతో నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించే వీలు ఉంటుంది. జలాంతర్గాముల శబ్దాలు, వాటి కదలిలకను ఇది వేగంగా గుర్తిస్తుంది.
  • ఇందులో 57 మంది ఉంటారు. ఏడుగురు అధికారులు.. 50 మంది సిబ్బంది
  • ఇందులోని లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ వ్యవస్థ సాయంతో సముద్రంలో చాలా లోపలివరకు నిఘా వేసేందుకు వీలు లభిస్తుంది. ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రు ముప్పును పసిగడుతుంది.
  • ఈ నౌకలో ఐఆర్ఎల్ యాంటీ-సబ్మెరైన్ రాకెట్ లాంచర్, 30 ఎంఎం నావెల్ సర్ఫేస్ గన్, అడ్వాన్స్డ్ ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడో లాంచర్, యాంటీ-సబ్మెరైన్ మైన్స్, 12.7 ఎంఎం రిమోట్ కంట్రోల్ గన్ వంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి.
  • తక్కువ లోతు ఉండే ప్రాంతాల్లో ఇది చాలా సమర్థంగా పని చేయగలదు. ఈ యుద్ధ నౌక పొడవు 78 మీటర్లు. దీంతో ఇది సముద్ర జలాల్లో వేగంగా, స్థిరంగా కదలగలదు.
  • ఈ నౌక గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లగలదు. దీంతో వేగవంతంగా చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్లలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
  • Please Click here For More…

Leave a Reply