Injuries | గీత కార్మికుడికి గాయాలు..

Injuries | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గాజర్ల సమ్మయ్య అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుండి పడి తీవ్రంగా గాయపడినట్లు గీత కార్మికులు తెలిపారు. రోజువారి గీతావృత్తిలో భాగంగా సమ్మయ్య తాటి చెట్టు ఎక్కుతున్నక్రమంలో సాయంత్రం కాలు జారి కిందికి పడిపోవడంతో గీత కార్మికులు హుటాహుటిన చిట్యాల ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. తల, పక్క ఎముకలకు తీవ్ర గాయలు కాగా పరకాల హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సొసైటీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, గీత కార్మికులు కోరారు.

Leave a Reply