నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు..

బిక్కనూర్, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ) : ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (State Housing Corporation Managing Director) గౌతమ్ చెప్పారు. బుధవారం మండలంలోని బస్వాపూర్, బిక్కనూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అనంతరం పలువురు తమకు ఇల్లు రాలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఐదు లక్షల రూపాయల వరకు లబ్ధిదారుల ఖాతా (Beneficiary account) లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మండలంలో మంజూరైన ఇండ్ల వివరాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని ఆయన చెప్పారు. వాటిని లబ్ధిదారులకు అందేవిధంగా అధికారులు (Officers) చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా జరిగేటట్లు చూడాలని అధికారులకు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక (sand) ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా ఇసుక ఉంటే అధికారుల అనుమతితో లబ్ధిదారులు తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ఆయనకు అధికారులు పలువురు నాయకులు ఘన స్వాగతం (warm welcome) పలికారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మండల తాసిల్దార్ సునీత, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Leave a Reply