INDIRA | ఇందిరమ్మ ఆశయ సాధనకు కృషి

  • మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డి
  • జగిత్యాల ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

INDIRA | జగిత్యాల ప్రతినిధి (ఆంధ్రప్రభ ) : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓల్డ్ బస్టాండ్ వరకు ర్యాలీగా తరలి వెళ్లి ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేస్తే, ఆ త‌ర్వాత అనంతరం దేశ సమగ్రత, ఐక్యత కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన ఘనత ఇందిరా గాంధీది అన్నారు. చివరి రక్తం బొట్టు వరకు దేశ సమగ్రత కోసం కృషి చేశారన్నారు. ప్రతీ గ్రామంలో భూసేకరణ చేసి, ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపట్టి ఇల్లు నిర్మించి ఆత్మ గౌరవం కాపాడారని, దున్నే వాడిదే భూమి అనే నినాదంతో భూములు పంపిణీ చేశారని గుర్తు చేశారు.

నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరా గాంధీ పథకాలు ఆదర్శమన్నారు. గత ప్రభుత్వం పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగు అయిందని, కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం ఉచిత గృహ విద్యుత్ అందించి అండగా నిలిచిందన్నారు. ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply