India Tour Of England 2026.. షెడ్యూల్ ఇదే!

ముంబయి : భారత్ -ఇంగ్లాండ్ (India -England) మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ (Five-match Test series) జరుగుతోంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే ఏడాది మళ్ళీ ఇంగ్లీష్ వారితో తలపడటానికి టీమ్ ఇండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. వచ్చే ఏడాది జులై 2026లో భారత్ -ఇంగ్లాండ్ మధ్య ఐదు T20 మ్యాచ్‌లు, మూడు ODI మ్యాచ్‌ల సిరీస్ జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ ను విడుదల చేసింది.

టూర్ ఫార్మాట్ & తేదీలు..
ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా, భారతదేశం ఇంగ్లాండ్‌లో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ (ODIs), ఐదు T20 ఇంటర్నేషనల్స్ (T20Is) మ్యాచ్‌లలో సిరీస్‌ను ఆడనుంది. ఈ పర్యటన జులై 2026లో జరగనుంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత..
టెస్ట్ అనుభవజ్ఞులుక్రమంగా తప్పుకుంటున్న వేళ కొత్త ఆటగాళ్లు జట్టులో చేరుతున్నారు. అలాంటి కొత్తతరం ఆటగాళ్లందరికీ వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌లు ముఖ్యమైన వేదిక అవుతుంది.

2026లో ఇంగ్లాండ్‌లో భారత పర్యటన

IND vs ENG 1వ T20I: జులై 1, బ్యాంక్స్ హోమ్స్ రివర్‌సైడ్, డర్‌హమ్‌

IND vs ENG 2వ T20I: జులై 4, ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

IND vs ENG 3వ T20I: జులై 7, ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్

IND vs ENG 4వ T20I: జులై 9, సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్

IND vs ENG 5వ T20I: జులై 11, యుటిలిటా బౌల్, సౌతాంప్టన్

IND vs ENG 1వ ODI: జులై 14, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

IND vs ENG 2వ ODI: జులై 16, సోఫియా గార్డెన్స్, కార్డిఫ్

IND vs ENG 3వ ODI: జులై 19, లార్డ్స్, లండన్

ప్రస్తుతం ఐదు టెస్టు మ్యాచ్‌ల కోసం ఇంగండ్‌ టూర్‌లో ఉన్న టీమిండియా 2-1 తేడాతో వెనుకబడి ఉంది. ప్రస్తుతం నాల్గో టెస్టు మాంచెస్టర్‌లో ఆడుతోంది.

Leave a Reply