india happy : బంపర్ ఆఫర్ : Andhra Prabha SPl Story

india happy : బంపర్ ఆఫర్ : Andhra Prabha SPl Story

  • ఇండియాకు ఇరాన్​ ఆయిల్​
  • అమెరికా ఆంక్షలు సడలింపు
  • 30 రోజులు భయం లేదు
  • హోర్ముజ చెర వీడితే లక్కీచాన్స్​
  • ఎనర్జీ భద్రతపై భారత్ కొత్త వ్యూహాలు
  • ఇథనాల్, ఈవీ వైపు మళ్లింపు
  • ఇక భారత్​ హ్యాపీ..హ్యాపీ

ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ

india happy

ఇరాన్​ ఆయిల్​ పై అమెరికా ఆంక్షల సడలింపుతో భారత్‌కు ఒక గొప్ప అవకాశం లభించినట్టే . ఈ నిర్ణయంతో తొలుత హ్యాపీ వ్యక్తం చేసింది. ఇక హోర్ముజ జలంసంధి చెర వీడి, ఆ 22 నౌక‌లు ఇండియాకు త‌ర‌లి వ‌స్తే భారత్​ ఆనందానికి అవధి ఉండదు. రష్యా ఇప్పటికే భారత్‌కు తక్కువ ధరకు చమురు ఇస్తోంది. ఇప్పుడు ఇరాన్ చమురుపై ఆంక్షలు తగ్గడంతో, భారత్ తక్కువ ధరకే ఇరాన్​ తో ఒప్పందాలు చేసుకునే వీలుంది. దేశీయంగా ధరలు పెరగకుండా అదుపు చేయవచ్చు. చమురు ధరలు బ్యారెల్‌కు $112.19 చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కొన్ని చర్యలపై దృష్టి కేంద్రీకరించింది.

india happy : సుంకం కోతపై దృష్టి

india happy

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు, సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తరచుగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 నుంచి రూ. 5 వరకు పన్ను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ VAT (Value Added Tax) తగ్గించాలని కేంద్రం కోరే అవకాశం ఉంది. భారతదేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ ఇతర సెస్‌లు. ప‌రిశీలిస్తే

india happy


దేశంలోనే అత్యధిక వ్యాట్ రేటును తెలంగాణ 35.20% వ‌సూలు చేస్తోంది. తమిళనాడు 13% VAT + రూ. 11.52/లీటర్, కర్ణాటక 29.84% VAT, మహారాష్ట్ర (ముంబై) 26% VAT + రూ. 5.12/లీటర్ అదనపు పన్ను, రాజస్థాన్ 36% VAT + రూ. 1500/KL రోడ్డు సెస్‌, పశ్చిమ బెంగాల్ 25% లేదా రూ. 13.12/లీటర్ (ఏది ఎక్కువైతే అది) + రూ. 1000/KL సెస్‌, ఢిల్లీ 19.4% VAT వ‌సూలు చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (H1), పెట్రోలియం రంగం నుండి వివిధ రాష్ట్రాల ఖజానాకు సుమారు రూ. 1,58,115 కోట్లు చేరాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ ఖ‌జానాకు సుమారు రూ. 14,482 కోట్లు., మధ్యప్రదేశ్:క‌ఉ సుమారు రూ. 7,285 కోట్లు. ఆంధ్రప్రదేశ్ కు రూ.14,700 కోట్ల ఆదాయం ల‌భించింది. ఈ స్థితిలో వ్యాట్ సుంకం వ‌సూళ్ల‌కు కోత విధించ‌గానికి ఆయా రాష్ట్రాలు ఎంత వ‌ర‌కూ అంగీక‌రిస్తాయ‌నేది ఓ ప్ర‌శ్న‌. .

india happy : స‌ర్కారు చేతికి చ‌మురు

india happy

చమురు సంస్థలు IOCL, BPCL, HPCL అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు పెంచకుండా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీలు నష్టాల్లో ఉంటే, ప్రభుత్వం బడ్జెట్ ద్వారా వారికి సబ్సిడీలు అందిస్తుంది. పెట్రోల్ బంకుల్లో ధరలు స్థిరంగా ఉంటాయి కానీ ప్రభుత్వ ద్రవ్య లోటు (Fiscal Deficit) పెరుగుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా, దేశీయంగా భారం పడకుండా ప్రభుత్వం భారీ ప్యాకేజీలను ఆయిల్ కంపెనీల‌కు ఇచ్చింది. 2025-26 లో దేశీయ ఎల్పీజీ (LPG) అమ్మకాల్లో కంపెనీల‌ నష్టాలను పూడ్చ‌టానికి రూ. 30,000 కోట్ల సబ్సిడీని 2025 ఆగస్టు లో కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2022-23 కరోనా తర్వాత, అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ ధరలు 300% పెరిగిన సమయంలో, ఓఎంసీల నష్టాలను భ‌ర్తీకి రూ. 22,000 కోట్లను కేంద్ర ప్ర‌భుత్వం వన్‌టైమ్ గ్రాంట్‌గా ఇచ్చింది. ఉజ్వల లబ్ధిదారులకు సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీని రూ. 200 నుంచి రూ. 300లకు పెంచారు. దీని కోసం 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 12,000 కోట్లు కేటాయించారు. గోల్డ్ మ‌న్ అంచ‌నా ప్ర‌కారం, 2027 జన‌వ‌రి వ‌ర‌కూ ఆయిల్ ధ‌ర‌లు ఇదే రీతిలో ఉంటే.. మ‌ళ్లీ ఆయిల్ కంపెనీల‌కు రాయితీ త‌ప్ప‌దు.

india happy : గోల్డ్‌మన్ ఎనాలిసిస్​

ఇరాన్ నుంచి 140 మిలియన్ బ్యారెళ్లు ఆయిల్​ మార్కెట్లోకి వచ్చినప్పటికీ, అది కేవలం తాత్కాలికమే. యుద్ధం వల్ల రోజువారీ ఉత్పత్తిలో 2 నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధ భయంతో వ్యాపారులు ధరలను పెంచేశారు. బ్రెంట్ క్రూడ్ ధర $112.19 వద్దే కాకుండా, మున్ముందు $125 వరకు వెళ్లే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల (Electric, Solar) వైపు వేగంగా మళ్లకపోతే, ఈ అధిక ధరల ప్రభావం 2027 వరకు కొనసాగుతుందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుందని హెచ్చరించింది. చైనా, భారత్ తదితర దేశాలు ఇరాన్ , రష్యా నుంచి తక్కువ ధరకు లభించే చమురు కోసం ఎదురుచూస్తున్నాయి. అమెరికా తన పారా వ్యూహాత్మక చమురు నిల్వలను (Strategic Petroleum Reserve) ఉపయోగించే అవకాశం ఉంది.

india happy : భారత్​ గుండెల్లో దిగులు

india happy

గోల్డ్‌మన్ సాక్స్ సూచించినట్లు 2027 వరకు అధిక ధరలు కొనసాగితే:
ఎన్నికలు లేదా పండుగల సీజన్ ఉన్నప్పుడు ప్రభుత్వం ధరలను పెంచకుండా సబ్సిడీలతో మేనేజ్ చేస్తుంది. అంతర్జాతీయ ధరలు $115 దాటితే, దేశీయంగా పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 5 నుండి రూ. 10 వరకు పెరిగే ప్రమాదం ఉంది. ధరల భారం తగ్గించడానికి ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ (Ethanol Blending) ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. దీనివల్ల చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.

​india happy : 22 నౌక‌లు వస్తే….

india happy

పశ్చిమ ఆసియాలోఉద్రిక్తతల కారణంగా పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతాల్లో 22 భారతీయ నౌకలు నిలిచిపోయాయి.నావికులు: ఈ 22 నౌకల్లో మొత్తం 611 మంది భారతీయ నావికులు ఉన్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. గత వారం మొదట్లో ఓడ‌ల సంఖ్య 28గా ఉండేది, కొన్ని నౌకలు సురక్షితంగా బయటకు చేరుకున్నాయి. . 22 నౌకల్లో ఎక్కువ శాతం భారతదేశ ఇంధన భద్రతకు సంబంధించినవే ఉన్నాయి వీటిలో 4 ముడి చ‌మురు నౌకలు, 6 LPG నౌకలు, 1 LNG నౌక.3 కంటైనర్ నౌకలు (Container Ships). 2 బల్క్ క్యారియర్లు (Bulk Carriers). 1 కెమికల్ ప్రొడక్ట్స్ నౌక. మిగిలినవి డ్రెడ్జర్లు లేదా మరమ్మత్తుల్లో (Dry dock) ఉన్న నౌకలు ఉన్నాయి. ఈ నౌకల్లో భారతదేశానికి అత్యంత కీలకమైన ఇంధన నిల్వలు ఉన్నాయి . సుమారు 16.7 లక్షల టన్నుల ముడి చ‌మురు, సుమారు 3.2 లక్షల టన్నుల LPG వంట గ్యాస్. 2 లక్షల టన్నుల LNG ఉన్నాయి.చిక్కుకున్న ఈ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత నావికాదళం (Indian Navy) యుద్ధనౌకల ద్వారా కాపలా కల్పించే ప్రణాళికను సిద్ధం చేసింది.

india happy : మాటల్లేవ్​… యుద్ధమే

india happy

అమెరికా ఆంక్షలను సడలించినప్పటికీ, ఇరాన్ నాయకత్వం తన దూకుడును తగ్గించడం లేదు. ఇరాన్ తాజా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఈ ఆంక్షల ఎత్తివేతను అమెరికా “ఓటమి”గా అభివర్ణించారు. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని తగ్గించుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తమ చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే, తాము కూడా గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాల చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ఆంక్షలు సడలించినా, ఇరాన్ తన అణు కార్యకలాపాలను పారదర్శకంగా ఉంచుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

ALSO READ : Iran Hurrey : ట్రంప్ స‌డెన్ బ్రేక్ Andhra Prabha Latest News

Leave a Reply