విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె

విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె
- జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలి
- ఆర్టిజన్, కార్మికుల డిమాండ్లపై ఆందోళన
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె ప్రారంభమైంది. సంగారెడ్డిలోని కరెంట్ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో గురువారం యూనియన్ ఉమ్మడి జిల్లా జేఏసీ జాయింట్ సెక్రెటరీలు హెచ్.రవీందర్, ప్రదీప్, శివరాజు, శివకుమార్ ఆధ్వర్యంలో నిరవదిక సమ్మె కొనసాగింది.
కార్మికులు తమ ప్రధాన డిమాండ్లుగా విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్‌పీడీసీఎల్లో అన్‌మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిసన్లుగా విలీనం చేయాలని కోరారు. అలాగే 2016కు ముందు అర్హతలు కలిగి పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిసన్లుగా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, 2026 పీఆర్సీ (వేతన సవరణ) అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. కార్యదర్శి ఆగం శ్రీనివాస్, కె.శైలజ, ఎల్.లక్ష్మితోపాటు భారీగా కార్మికులు పాల్గొన్నారు.
