భారత్‌తో జరగనున్న కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన జోష్ టంగ్ స్థానంలో ఆర్చర్ చేరాడు. రెండో టెస్ట్ లైనప్ నుండి ఇంగ్లండ్ జట్టులో ఇదే ఏకైక మార్పు.
30 ఏళ్ల జోఫ్రా ఆర్చర్ దాదాపు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి రావడం విశేషం. చివరిసారిగా అతను ఫిబ్రవరి 2021లో భారత్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
మూడో టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు :
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, బ్రైడాన్ కార్స్, క్రిస్ వోక్స్.
ఈ మార్పు ఇంగ్లాండ్ పేస్ దళాన్ని మరింత బలంగా మారుతుందని, లార్డ్స్ పిచ్‌పై ఆర్చర్ తన స్వింగ్, బౌన్స్‌తో భారత బ్యాగర్లను ఇబ్బంది పెడతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.