IND v SA | భారత్ ఘోర ఓటమి

IND v SA | భారత్ ఘోర ఓటమి
- రెండో టెస్టులో పరాభవం..
- సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సౌతాఫ్రికా
IND v SA | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ చిత్తుగా ఓడింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 రన్స్(South Africa 408 runs) తేడాతో విజయం సాధించింది. 549 పరుగుల భారీ టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్‌లో బరిలో దిగిన టీమ్ఇండియా 140 రన్స్‌కే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (54) ఒక్కడే రాణించాడు.
మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హార్మర్ 6 వికెట్ల(Simon Harmer 6 wickets)తో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2, ముత్తుసామి, మార్కో యాన్సెన్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
స్వదేశీ పిచ్‌లపై ఇండియా దారుణమైన రీతిలో ఓటమిని చవిచూసింది. మరీ 408 రన్స్ తేడాతో స్వంత పిచ్‌పై ఓడిపోవడం .. ఇండియన్ బ్యాటింగ్ లైనప్(batting line-up)లో బలహీనతలను బయటపెట్టింది. దక్షిణాఫ్రికా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్(INDvSA)ను 2-0 తేడాతో సొంతం చేసుకున్నది.
గతంలో 2000 సంవత్సరంలో హన్సీ క్రానే నేతృత్వంలోని దక్షిణాఫ్రికా చేతిలో కూడా ఇండియా టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.
