Incident | ప్రమాదమని చిత్రీకరించే ప్రయత్నం..!

Incident | ప్రమాదమని చిత్రీకరించే ప్రయత్నం..!
Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్లను భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ, భార్య ఫర్హాత్(26), కూతుళ్లు ఉమేరా(8), అయేషా(6)తో నివాసం ఉంటున్న అజారుద్దీన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తరువాత, భార్య రెండు సార్లు గర్భం దాల్చగా ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అబార్షన్ చేయించాడు. నాలుగేళ్ల అనంతరం మళ్లీ గర్భవతి కావడంతో మరోసారి అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు.
హత్య వెలుగులోకి ఎలా?
భార్య అంగీకరించకపోవడంతో, ఆమెను, పిల్లలను స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి అందులో తోసేసి హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఫర్హాత్ తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అజారుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
