ఆ విషయంలో.. రైతుల సహకారం అవసరం..

ఆ విషయంలో.. రైతుల సహకారం అవసరం..
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : రైతులు తీసుకున్న సల్ఫకాలిక, దీర్ఘకాలిక రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని హసన్ పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపత్తి సంఘం (పీఏసీ ఎస్) పర్సన్ ఇంచార్జి జగన్మోహన్ రావు అన్నారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి పీఏసీఎస్ మహ జన సభను నిర్వహించారు. ఈ మేరకు సంఘ ఆదాయ, వ్యయాలను వివరించారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న కొనుగోలుకు అనువైన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సంఘాన్ని లాభాల బాటలో నడిపించేందుకు రైతుల సహకారం అవసరమని పేర్కొన్నారు. సొసైటీ నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ మహాజన సభలో రైతులకు అవసరమైన విషయాలను చర్చించారు. మడిపల్లిలో ఫెర్టిలైజర్ సేల్ పాయింట్, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, డీసీసీ బ్రాంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్ స్పెక్టర్ సత్యనాధ్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, సంఘ సెక్రటరీ సింగిరెడ్డి శ్రీనివాస్, సిబ్బంది జెపాల్, రంజిత్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
