icc t20| వాంఖడేలో పరుగుల పండగ

icc t20| వాంఖడేలో పరుగుల పండగ
పంచ్ బ్యాటర్లకు అనుకూలం
వర్షం పడే చాన్స్ లేదు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే సెమీఫైన్-2లో ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుండటంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి.

వాతావరణం.. పిచ్ .. సూపర్
వాంఖడే స్టేడియం పిచ్ సంప్రదాయంగా బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మైదానం ఔట్‌ఫీల్డ్ వేగంగా ఉండటంతో బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడేందుకు వీలుంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో సగటున 190 నుంచి 220 పరుగుల స్కోరును ఆశించవచ్చు. స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించకపోయినా, వైవిధ్యం ప్రదర్శించే పేసర్లు ప్రభావం చూపగలరు. ఇక, వాతావరణం విషయానికొస్తే ఆకాశం నిర్మలంగా ఉండి మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని అంచనా. ఉష్ణోగ్రతలు 27-37 డిగ్రీల మధ్య ఉండొచ్చు. గాలిలో తేమ 60 శాతానికి పైగా ఉండే అవకాశం ఉంది.
