ICC Champions Trophy | జకర్ అలి, తౌహిద్ అర్ధ శతకాలు.. ఆరో వికెట్ కు 130 పరుగులు జోడింపు ….
దుబాయ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో ఇద్దరు బంగ్లా బ్యాటర్లు అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు.. 35 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్ లోకి వచ్చిన జకర్ అలి , తౌహిద్ లు బంగ్లా కుప్పకూలకుండా అడ్డుకున్నారు.. ఈ ఇద్దరు కలసి స్కోర్ బోర్డును పరుగు పెట్టించారు.. భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇద్దరు అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు.. ఆరో వికెట్ కి ఇద్దరు ఇప్పటికే 130 పరుగులు జోడించారు.. ప్రస్తుతం జకర్ అలి 60, తౌహిద్ 70 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.. ఈ జోడి విడదీసేందుకు రోహిత్ ఆరుగురు బౌలర్లను రంగంలోకి దించిన వికెట్ మాత్రం పడలేదు.. ఇక బంగ్లాదేశ్ 40 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది

ఇక తొలి సెషన్ లో భారతీయ బౌలర్ల హవా కొనగింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్స్ క్రీజులో కుదురుకోనివ్వకుండానే పెవిలియన్ కు చేర్చారు. ఫేస్ బౌలర్ షమీ, హర్షీత్ రాణా లు మూడు వికెట్లు సాధించగా, స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా తన మాయాజాలంతో వికెట్లు పడగొడుతున్నాడు. బంగ్లా బ్యాటర్స్ లో హసన్ 25 చేయగా, సౌమ్య సర్కార్, శాంటో, ముష్పికర్ లు డకౌట్ అయ్యారు. ఇక హసన్ మీర్జా సైతం 5 పరుగులకే వికెట్ పోగొట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకూ షమీ, అక్షర్ లు రెండు వికెట్ల చొప్పున పడగొట్టగా, హర్షీత్ రాణాకు ఒక వికెట్ దక్కింది.