నిస్వార్థంగా పని చేస్తా.. ఆదరించి గెలిపించండి..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి అక్కేపల్లి సుజాత క్రాంతి కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా శనివారం వార్డులోని ప్రతి గల్లీ, ప్రతి కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న అక్కేపల్లి సుజాత క్రాంతి కుమార్ కు ఓటర్ల నుంచి అపూర్వ స్పందన, మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యే విజయ రమణారావు నాయకత్వంలో వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.

ఈ సందర్భంగా సుజాత క్రాంతి మాట్లాడుతూ తన గెలుపుతో 10వ వార్డుకు మహర్దశ పట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పూర్తి సహకారం, అండదండలతో ప్రత్యేక నిధులు మంజూరు చేయించి వార్డులో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడిలా అందుబాటులో ఉంటానని, సమస్యలపై తక్షణమే స్పందిస్తానని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply