Hydra : భారీ హోర్డింగుల కూల్చివేత..
శంషాబాద్, ఫిబ్రవరి 7(ఆంధ్రప్రభ) : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులను హైడ్రా అధికారులు, శంషాబాద్ మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులను అధికారులు తొలగించారు.