వెల్దండ మండలంలో భారీ పోటీ..

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల పరిధిలోని 32 గ్రామపంచాయతీలకు గాను మొత్తం 141 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, వీరిలో 84 మంది బరిలో నిలిచినట్లు ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా, 270 వార్డులకు గాను మొత్తం 572 మంది పోటీ చేయగా, 508 మంది వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం జరిగిన నామినేషన్ ఉపసంహరణ (విత్‌డ్రా) ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఆయన తెలిపారు.
