స్విట్జర్లాండ్ : స్విస్ బ్యాంకుల్లో భారతీయులు (Indians) దాచుకున్న డబ్బు గతేడాది కంటే ఏకంగా మూడు రెట్లు పెరిగిందని స్విస్ నేషనల్ బ్యాంక్ (Swiss National Bank) వెల్లడించింది. 2024 నాటికి రూ.37,600 కోట్ల డబ్బు ఉన్నట్లు పేర్కొంది. వీటిలో ఎక్కువ మొత్తం వ్యక్తిగత ఖాతాల నుంచి కాకుండా బ్యాంక్ ఛానల్స్, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వచ్చాయని సమాచారం. అయితే స్విట్జర్లాండ్ (Switzerland) లో భారతీయుల ఆస్తులను నల్లధనంగా పేర్కొనలేమని స్విస్ బ్యాంక్ అధికారులు తెలిపారు.
Switzerland | స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఎంత ఉందంటే?
