గీత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

గీత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
హాసన్ పర్తి, ఆంధ్రప్రభ : గీత కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,హాసన్ పర్తి మండల అధ్యక్షుడు మోటపోతుల రాజు గౌడ్ అన్నారు. హాసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామంలో ముంజ మహేందర్(45) తాటి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలు పాలైనాడు.
వెంటనే తోటి గీత కార్మికులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రోజున బాధితుడిని కుటుంబ సభ్యులను ప్రైవేట్ ఆస్పత్రిలో రాజు గౌడ్, వల్లాల గంగాధర్ గౌడ్, ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ నేరుగా కలిసి వారికి ధైర్యం చెప్పి సానుభూతిని తెలిపారు. కష్టకాలంలో కల్లుగీత కార్మిక సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని గీత కార్మికుల జీవితాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
