జిల్లాస్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామ ఎంపీపీ ఎస్ పాఠశాలకు చెందిన చెరుకు వేదావ్యాస్ అనే మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి జిల్లాస్థాయికీ ఎంపికైన సందర్భంగా శుక్రవారం ఆ గ్రామస్తుడు నేరెళ్ల ఓం నారాయణ గౌడ్ శాలువా తో విద్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
