Honor | స‌న్మానం..

Honor | పెద్దమందడి, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పెద్దమందడి మండల కేంద్రంలోని ముదిరాజ్ కులం తరపున గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు వార్డు సభ్యులకు జంగం పద్మ శివ 8వార్డు, వాకిటి రమేష్, 9వార్డు, గొడుగు జ్యోతి రాజశేఖర్, 10వార్డు, కొత్త స్వాతి రాములు, 11వార్డు నుంచి ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ గా సూర్య గంగమ్మ రవి, ఉప సర్పంచ్‌ గా బోయిని ఉషన్న యాదవ్ ఈ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. ఎన్నికైన వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా ముదిరాజ్ కుల సంఘం యువకులు ఘనంగా సన్మానించారు.

ఈసందర్భంగా ముదిరాజ్ కుల సంఘం యువకులు ప్రజా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికి, భవిష్యత్తులో ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని కోరారు. వారి విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ కుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రానున్న కాలంలో గ్రామ అభివృద్ధికై అందరూ కలిసికట్టుగా తోడ్పడతామని సర్పంచి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రభుత్వపరంగా వచ్చిన అన్ని స్కీమ్స్ ప్రభుత్వ పథకాలను కులమతమనే భేదం లేకుండా లబ్ధిదారులకు అందరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఈకార్యక్రమంలో యువ నాయకుడు అడ్వకేట్ నందిమల్ల త్రినాథ్ ముదిరాజ్ వాకిటి వేణుగోపాల్, మాజీ జెడ్పిటిసి నందిమల్ల వేణుగోపాలకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ గొడుగు రామచంద్ర, వాకిటి నాగభూషణం, పద్మనాభం, వైభవ్ శీను, నందిమల్ల బాలరాజు, మాజీ వార్డు సభ్యులు, రిటైర్డ్ హెడ్మాస్టర్ నందిమల్ల కృష్ణయ్య, నందిమల్ల కురుమూర్తి, వాకిటి సత్యనారాయణ, వీరమని కృష్ణయ్య, కుల పెద్దలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply