Honor | మర్యాదపూర్వకంగా..

Honor | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని అల్లాపురం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకే అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అల్లాపురం గ్రామ 8వ వార్డు సభ్యులు భూతం లింగస్వామి యాదవ్, బీఆర్ఎస్ యువజన నాయకులు బోయిని వెంకటేష్ యాదవ్, రుద్రాల స్వామి తదితరులు పాల్గొన్నారు.
