అంబేద్కర్ విగ్రహ ఘటనపై..

  • నిప్పు పెట్టిన వ్యక్తులను టెక్నాలజీ సాయంతో వెంటనే అరెస్టు చేశారు
  • వైసీపీ నేతలు దీన్ని రాజకీయం కోసం వాడుకున్నారు

వెదురుకుప్పం, ఆంధ్రప్రభ: దళితులకు రాజ్యాంగ హక్కు కల్పించిన మహా నేత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ను కూడా రాజకీయ క్రీడకు వాడుకోవడం దారుణమని, ప్రభుత్వంపై బురద జల్లడానికి చేసే ప్రయత్నాలన్నింటినీ, అడ్డుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల పూడి అనిత (Anita) విమర్శించారు. చిత్తూరు జిల్లా జీ.డీ.నెల్లూరు నియోజకవర్గం దేవళంపేట గ్రామంలో ఇటీవల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఘటనను మంత్రి అనిత పరిశీలించారు.

చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గు మళ్ల ప్రసాదరావు (Prasada Rao), జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, ధామస్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ, టీడీపీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత కక్షతో అంబేద్కర్ విగ్రహం కింద షాపును తగుల బెట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా దళితులను తప్పుపట్టించి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు.

జిల్లా పోలీసు యంత్రాంగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం (Advanced technology) తో ఈ కేసును చేధించారని, అభినందించారు. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రిగా పనిచేసిన పేర్నినాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను బెదిరిస్తాడా? ఇది పోలీసులకు అవమానం.. దానికి తగ్గట్టుగా పోలీసులు యాక్షన్ ఉంటుంది. ఐదేళ్లుగా రౌడీయిజం చేస్తున్న వీళ్ళు ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రవర్తించాలంటే ఇప్పుడు కుదరదన్నారు. తప్పు చేసిన వాడికి నోటీసు ఇస్తాం కేసులు పెడతాం.. జైల్లో పెడుతామన్నారు.

ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతలకు మాత్రం బుద్ధి రావడం లేదు. నకిలీ మద్యం తయారీపై కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. నకిలీ మద్యం తయారీ విషయం తెలిసిందే.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వారందరిపైన కేసులు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. నకిలీ మద్యం తయారీలో పైకి కనబడుతున్న వారు కాదు. తెర వెనుక కుట్రలు చేసిన వారు త్వరలోనే బయటకు వస్తారని, దాని వెనుకున్న కుట్రను చేదిస్తామని హోంమంత్రి అనిత (Home Minister Anita) అన్నారు.

Leave a Reply