Home construction |సొంత ఇంటి కలను నిజం చేయడమే….

Home construction |సొంత ఇంటి కలను నిజం చేయడమే….

Home construction |బిచ్కుంద, ఆంధ్రప్రభ : ప‌ది ఊర్ల‌కు సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లను భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇండ్లు లబ్ధిదారులు తొందరగా నిర్మించుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, వాజిద్ నగర్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు నౌషా నాయక్, బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, గుండె కల్లూరు కాంగ్రెస్ నాయకులు రాజు పటేల్, మాజీ ఏఎంసి చైర్మన్ నాగనాథ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply