రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి…

రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి…

  • తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన చేసిన బిజెపి నేతలు,

చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సోమవారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఇమామ్ బాబాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, కానీ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేద‌న్నారు.

యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూసమస్యల పరిష్కారం, వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. హామీల అమలు చేయకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శ లు రావుల రాకేష్, మైదం శ్రీకాంత్, జిల్లా జిల్లా కార్యదర్శి సుదగని శ్రీనివాస్, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య, న సీనియర్ నాయకులు మండల నాయకులు చెక్క నరసయ్య ,మండల మొగిలి, గజనాల రవీందర్, గుండ సురేష్ ,పాలకుర్తి బిక్షపతి, చింతల రాజేందర్ ,గుర్రపు రవీందర్, కేంసారపు ప్రభాకర్, రాయిని శ్రీనివాస్, బుర్రి తిరుపతి, పాలకుర్తి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply