భారతదేశానికి ప్రాణం హిందూ ధర్మం..

భారతదేశానికి ప్రాణం హిందూ ధర్మం..

రెంజల్, ఆంధ్రప్రభ : సమాజంలో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని శ్రీలింగేశ్వర గుట్ట ఆశ్రమం శ్రీశ్రీశ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ అన్నారు. శనివారం రాత్రి మండల కేంద్రంలోని హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. మొదట చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా శివాలయం వద్దకు చేరుకున్నారు. శివాలయంలో పిట్ల కృష్ణ మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హిందూ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. హిందూ ధర్మం చాలా పవిత్రమైనదని, అందుకే భారతదేశానికి ఆత్మ, ప్రాణం హిందూ ధర్మం. హిందూ సంస్కృతి, హిందూ సమాజం గొప్పదని చెప్పారు. అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని విశ్వ గురువుగా నిర్మాణం చేయాలని లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ స్థాపించడం జరిగిందని చెప్పారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సెప్టెంబర్ 25వ తేదీన 1925లో స్థాపించి, సంఘ ప్రయాణంలో నిరంతర కృషి, మన సఫల కార్యాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ, భవిష్యత్ సాధన మార్గాన్ని దర్శిస్తూ, ఈ మహత్కార్యంలో హిందూ బంధువులందరిని భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనంగా ప్రసిద్ధిగాంచింది. రెంజల్ ఉపమండలం మండల కేంద్రంతో పాటు వీరన్నగుట్ట, వీరన్నగుట్ట తండా, దండిగుట్ట, కళ్యాపూర్, దూపల్లి, కూనేపల్లి, బాగేపల్లి, అంబేద్కర్ నగర్, కిసాన్ తండా గ్రామాల నుండి హిందూ బంధువులుగా తరలి వచ్చారు.

నవీపేట్ లింగం గుట్ట పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ రాజ యోగి సిద్దేశ్వర మహారాజు, ఇందూరు విభాగ్ ప్రచారక్, తెలంగాణ ప్రాంత సహా బోధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఆకుల దేవి దాసు, ప్రధాన కార్యదర్శి మంతూరి లక్ష్మణ్ గౌడ్, మోహన్ రెడ్డి, రంజిత్ కుమార్, ఇర్ల రాజు, సుక్కరాజు గౌడ్,లోలపు కిషోర్, ఆర్మూర్ సతీష్, క్రాంతి, రాకేష్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సామ్రాది.శేఖర్,లోలపు ఓడ్డెన్న, తగిలిపల్లి అంజయ్య,ఆర్మూర్ హనుమాన్లు,సాయ గౌడ్,హనుమాన్ స్వాములు, తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Leave a Reply