Highway | ఫుల్ జామ్..!

Highway | ఫుల్ జామ్..!
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కిటకిట
- క్యూ కట్టిన వాహనాలు
- సంక్రాంతికి సొంతూళ్లకు పయనమైన నగరవాసులు
వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ ; సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీగా మారింది. పండగకు ఊళ్లకు వెళ్లే వారి వాహనాలు హైవేపై బారులుదీరాయి. శుక్రవారం సాయంత్రం నుంచే ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ రోజు నుంచి అది మరింత ఎక్కువగా ఉంది.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు క్యూ కట్టాయి.

మరోవైపు జాతీయ రహదారిపై అండర్‌పాస్ వంతెన, సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరం నుంచి తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలకు అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు.
Highway | కిటకిటలాడుతున్న బస్టాండ్లు :

శుక్రవారం నుంచి ఎంజీబీఎస్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ బస్టాండ్లు ప్రయానికులతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్సులు నిండిపోయాయి. రద్దీకి అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతున్నా సరిపోవడం లేదు. ఇలా ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక ప్రైవేట్ వెహికల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు ఇదే అదునుగా టికెట్ ధరలను డబుల్ చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
