మార్చి 28వ తేదీన కీ౹౹శే పోతిన చిన్నా సంస్మరం సభ..

మార్చి 28వ తేదీన కీ౹౹శే పోతిన చిన్నా సంస్మరం సభ..

ఏపీ నగరాల సంఘం

భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ మాజీ శాసనసభ్యులు కీ౹౹శే పోతిన చిన్నా సంస్మరం సభ మార్చి 28 శనివారం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం,వన్ టౌన్ బ్రాహ్మణ వీధి కార్యాలయం నుండి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.పోతిన చిన్నా 29వ వర్ధంతి సందర్భంగా ఉదయం 8:00 గం౹౹లకు విజయవాడ కొత్తపేట తేలప్రోలు రాజా హై స్కూల్ ఎదురుగా “ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోతిన చిన్నా కాంస్య విగ్రహము వద్ద వారికి నివాళులు అర్పించు కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగరాల సోదర, సోదరిమణులు తప్పక పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ద్వారా గత 50 సంవత్సరాలుగా నగరాల అభ్యున్నతికి అనేక సేవ కార్యక్రమాలను చేస్తూ, నగరాలకు బి.సి. హోదా కల్పించటంలో విశేష కృషి చేయడం జరిగిందని , నగరాల అభివృద్ధి కొరకు విస్తృతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అన్ని జిల్లాలలో, సుదూర ప్రాంతాలలో ఉన్న నగరాల సామాజిక వర్గంలోని ప్రతి వ్యక్తి తమ శక్తి సామర్ధ్యాలతో తాము పని చేస్తున్న రంగాలలో అత్యున్నత స్థాయికి చేరుకొని, నగరాల సామాజిక వర్గం స్థాయిని, ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకొనివెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏపీ నగరాల సంఘం ప్రతినిధులు ప్రెసిడెంట్ బాయన బాబూజీ(బాబ్జి), జనరల్ సెక్రెటరీ పోతిన వేంకటేశ్వరస్వామి, ట్రెజరర్ రాజగిరి సోమేశ్వరరావు,ఈది సూరిబాబు ,పిళ్ళా మోహనరావు ముదిలి మోహనరావు, కార్యవర్గ సభ్యులు.

Leave a Reply