Helmet Rally | సురక్షిత ప్రయాణానికి – హెల్మెట్ తప్పనిసరి

Helmet Rally | సురక్షిత ప్రయాణానికి – హెల్మెట్ తప్పనిసరి

Helmet Rally | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : సురక్షిత ప్రయాణానికి – హెల్మెట్ తప్పనిసరి అని మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. బాలకృష్ణ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా మంగళగిరిలో హెల్మెట్ ర్యాలీ(Helmet Rally) నిర్వహించి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా ధరించాలని, తద్వారా ప్రమాదాలలో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుటకు అవకాశం ఉందని చెప్పారు.

తీవ్రమైన రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది బాధితులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు. హెల్మెట్ అనేది కేవలం ఒక చట్టపరమైన(legal) నిబంధన మాత్రమే కాదని, అది ఒక ప్రాణరక్షణ కవచం అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు, హెల్మెట్ తలకు తగిలే దెబ్బ తీవ్రతను తగ్గిస్తుందని, మెదడుకు గాయం కాకుండా రక్షిస్తుందన్నారు.

Helmet Rally |

హెల్మెట్ పెట్టుకోవడానికి పట్టే ఆ ఒక్క సెకను మీ జీవితకాలపు భద్రతను నిర్ధారిస్తుందన్నారు. జరిమానాల నుండి తప్పించుకోవడానికే కాకుండా, “మీ కుటుంబం కోసం, మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవడాని హెల్మెట్ ధరించండి అని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించే వారు హెల్మెట్ బెల్టును విధిగా అమర్చాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, వాహన డీలర్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply