మన ప్రాణాన్ని మనమే రక్షించుకోవాలి…

మన ప్రాణాన్ని మనమే రక్షించుకోవాలి…
స్పీకర్ ప్రసాద్ కుమార్
వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించడం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. సోమవారం వికారాబాద్ మండలం అత్తిలి గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కార్లు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెడ్ ధరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మదన కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జిల్లా ఎస్పీ స్నేహమేరా, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ ,పార్టీ మెంబర్ జాఫర్, గ్రామ సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
