Health tests | విద్యార్థులకు వైద్య పరీక్షలు

Health tests | విద్యార్థులకు వైద్య పరీక్షలు
Health tests | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కళాశాలల విద్యార్థులకు గురువారం డాక్టర్ చింతకింది కాటమరాజు ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కాటమరాజు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్, డాక్టర్ నరేష్, డాక్టర్ సౌజన్య, డాక్టర్ అనిత, సిహెచ్ఓ మనోహర్, ఎంఎల్ హెచ్ పి లు ప్రణతి, పారిజాత, రజిత, జ్యోతి, హెచ్ ఈ ఓ సత్యనారాయణ, శశికళ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
