వీరమల్లు ట్విస్ట్‌.. క్లైమాక్స్‌లో మార్పు..!

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: పవన్‌ కల్యాణ్‌ తొలి పాన్‌ ఇండియా సినిమా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara VeeraMallu) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే, ఈ సినిమా థియేటర్‌ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

థియేటర్‌లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఇందులోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని సీన్స్‌లోని వీఎఫ్ఎక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సిందని కామెంట్స్‌ వినిపించాయి. ఇప్పుడు ఆ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో తొలగించినట్లు సమాచారం. ముఖ్యంగా గుర్రపు స్వారీ సన్నివేశం, పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) బాణం గురిపెట్టే సీన్స్‌ను థియేటర్లో విడుదలైన తర్వాత మార్పులు చేశారు. అయితే ఓటీటీలో ఈ సన్నివేశాలను పూర్తిగా కట్‌ చేశారని నెటిజన్లు పేర్కొంటున్నారు. క్లైమాక్స్‌లోనూ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అసుర హననం పాట తర్వాత పార్ట్‌2 ప్రకటనతో సినిమాను పూర్తి చేశారట. క్లైమాక్స్‌లో వచ్చే బాబీదేవోల్‌ సంభాషణలు, కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను కూడా తొలగించారట. మొత్తం మీద చిత్రబృందం దాదాపు 15 నిమిషాల ఫుటేజ్‌ను కట్‌ చేసి ఓటీటీలో విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply