పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
TG | ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు : సీఎం రేవంత్
