గురుకుల పాఠశాల విద్యార్ధి అదృశ్యం..

గురుకుల పాఠశాల విద్యార్ధి అదృశ్యం..
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి పెద్దపోలు నాగ వర్ధన్ కనపించడం లేదు. నిన్న సాయంత్రం నుంచి పాఠశాలలో విద్యార్ధి కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసారు. చెన్నూరు పట్టణం మహంకాళివాడకు చెందిన విద్యార్ధి పెద్దపోలు నాగ వర్ధన్ కుటుంబ సభ్యులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.
