gudivada | కూటమి దుర్మార్గాలను ప్రశ్నించి నందుకే దాడి

gudivada | గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ రాజేంద్రనగర్లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడులు అత్యంత హేనీయమైన చర్య అన్నారు. అధికారం ఉందని చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని… రాష్ట్రం మీ సొంత జాగీరు కాదని… ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులన్నీ ఒకేలా ఉండవు,మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. వడ్డీతో సహా మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తామన్నారు.

కర్రలు రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబును చంపాలని, అంబటి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారన్నారు. రాష్ట్రంలో ఆటవిక ప్రభుత్వం నడుస్తోందంటూ మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడల్లా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలేటి చంటి, ఎంవి నారాయణరెడ్డి, అద్దేపల్లి పురుషోత్తం, లోయ రాజేష్, రేమల్లి నీలాకాంత్, ఎస్ కే బాజీ, షేక్ సయ్యద్, సింహాద్రి రాంబాబు, గుదే రవి, కంభం ఇమ్మనుఏలు, రమీజా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply