GT vs PBKS | రెండో వికెట్ కోల్పోయిన‌ పంజాబ్ కింగ్స్..

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో.. పంజాబ్ జట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తుంది. అయితే, ఓపెన‌ర్ గా దిగిన ప్రియాంష్ ఆర్య… దూకుడుగా ఆడుతుండ‌గా.. క్యాచ్ ఔట‌య్యాడు.

దీంతో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బ‌రిలోకి దిగిన ప్రియాంష్ ఆర్య.. 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సుల‌తో 47 ప‌రుగులు సాధించాడు. అయితే, 6.4వ ఓవ‌ర్ ర‌షీద్ ఖాన్ బౌలింగ్ లో వికెట్ పారేసుకున్నాడు.

దీంతో 79 ప‌రుగుల‌కు రెండో వికెట్ కోల్పోయింది పంజాబ్ జ‌ట్టు. ప్ర‌స్తుతం క్రీజులో శ్రేయ‌స్ అయ్యార్ (24) – అజ్మతుల్లా ఒమర్జాయ్ ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ బౌలింగ్ ఎంచుకుని పంజాబ్ కింగ్స్ ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *