ఐపీఎల్ 2025లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ జట్టు దంచికొడుతొంది. 9.1 ఓవర్లో 100 పరుగులు సాధించింది. అయితే, 11వ ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్ దూకుడుకి గుజరాత్ బ్రేక్ వేసింది.
యంగ్ స్పిన్ బౌలర్ సాయి కిషోర్ వేసిన ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 10.3వ బంతికి అజ్మతుల్లా ఒమర్జాయ్ (16) ఔటవ్వగా.. 10.4వ బంతికి గ్లెన్ మాక్స్ వెల్ డకౌట్ గా వెనుదిరిగాడు.
దీంతో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ కోల్పోయింది. దీంతో 10.4 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 105/4. ఇక ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యార్ (44) – మార్కస్ స్టోయినిస్ ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ బౌలింగ్ ఎంచుకుని పంజాబ్ కింగ్స్ ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.