చేంగల్ గ్రామ యువకుడికి గ్రూప్-1 ఉద్యోగం

చేంగల్ గ్రామ యువకుడికి గ్రూప్-1 ఉద్యోగం
- ఎంపీడీవో జాబ్ రావడంపై అభినందనలు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 నియామక పరీక్షలో461.5 మార్కులతో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ చేంగల్‌కి చెందిన నంబీ అత్రేయ (Nambi Athreya)… మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) (MPDO) ఉద్యోగం సాధించాడు.
ప్రస్తుతం ఆయన చెన్నై ఎయిర్ పోర్ట్స్ సదరన్ రీజినల్ మేనేజర్ (Regional Manager) గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి నంబీ శ్రీనివాస్ ఉపాధ్యాయుడు. ఈ సందర్బంగా చేంగల్ గ్రామ ప్రజలు, నంబీ అత్రేయ కుటుంబ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
