ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో రూ. 800 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శనివారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు, అదనపు కలెక్టర్ విక్టర్ ముఖ్య అతిథులుగా హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీయూఎఫ్‌ఐడీసీ సహాయంతో ఈ ప్రాజెక్టు అమలవుతోందని, ఆధునిక క్రీడా సదుపాయాలతో యువతకు ఉపయోగపడేలా రూపొందిస్తున్నామని తెలిపారు.

స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ షూటింగ్ రేంజ్, టేబుల్ టెన్నిస్ హాల్, యోగా హాల్, జిమ్నాసియం వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ స్టేడియం నిర్మాణంతో ప్రాంతీయ యువతకు మెరుగైన క్రీడా వేదిక లభిస్తుందని, క్రీడా అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply